Ratan Tata : అజాత శత్రువు.. దాన కర్ణుడు.. మన రతన్ టాటా

పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. మానవత్వం గల గొప్ప వ్యక్తి.

Update: 2024-10-10 02:11 GMT

పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. మానవత్వం గల గొప్ప వ్యక్తి. అత్యం నిరాడరంబరంగా నిత్యం కనిపించే రతన్ టాటా 1937 డిసెంబరు 28వ తేదీన జన్మించారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ పట్టాను పొందిన రతన్ టాటా ఆ తర్వాత టాటా గ్రూపులో చేరారు. ఒక ఉద్యోగిగా తన జీవితాన్ని టాటా సంస్థలో ప్రారంభించారు. షాప్ ఫ్లోర్ లో ఆయన పనిచేశారు. తర్వాత 1991లో టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు.

ఉద్యోగిగా చేరి...
టాటా గ్రూపును ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఆయన కృషి అనన్య సామాన్యం.1990 నుంచి 2012 వరకూ వరకూ ఆయన టాటా గ్రూపునకు ఛైర్మన్ గా ఉన్ారు. 2017 వరకూ తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. రతన్ టాటా తన గ్రూపు సంస్థలను విస్తరించడమే కాకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. పది వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు చేర్చడంలో ఆయన పనితీరు, ఆలోచనలే కారణమని అందరూ అంగీకరిస్తారు. కేవలం డబ్బు ఉంటేనే సరిపోదని, దానిని మానవాళి అవసరాలకు, సమస్యలకు ఉపయోగించాలని నిత్యం పరితపించే రతన్ టాటాను అభిమానించని వారుండరు.
దాన ధర్మాలలో...
ఆయనకు వ్యాపార రంగంలోనూ, బయటగాని ఎవరూ శత్రువులు లేరు. ప్రతి ఒక్కరూ ఆయనను ప్రేమించే వారే. దేశం పట్ల ఆయన ప్రేమ చూసిన వారికి ఎవరికైనా చేతులెత్తి నమస్కరిస్తారు. తన సంపదలో దాదాపు 65 శాతం దానాలకే కేటాయించారు. రతన్ టాటాకు భారత ప్రభుత్వం పద్మభూషన్, పద్మ విభూషణ్ సేవలతో గౌరవించింది. కరోనా వంటి క్లిష్ట సమయంలో రతన్ టాటా పదిహేను వందల కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటు కున్నారు. అలాంటి రతన్ టాటా దివికేగడం భారత్ కు తీరని లోటు. ఆయన మృతి పట్ల ప్రముఖులందరూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన పార్ధీవ దేహాన్ని ముంబయిలోని ఆయన స్వగృహానికి తరలించారు.


Tags:    

Similar News