ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరు

పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించారు. ఆయన ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు

Update: 2024-10-10 01:39 GMT

పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించారు. ఆయన ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల వయసు రీత్యా అనారోగ్యం పాలయ్యానని, ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లానని ట్వీట్ చేసిన రతన్ టాటా రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధృవీకరించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
టాటా మరణవార్త తెలిసిన వెంటనే దేశంలో ప్రముఖులందరూ తమ సంతాపాన్నితెలియజే చేస్తున్నారు. రిలయన్స్ అధినేత అంబానీ ఈ వార్త తెలిసిన విన్న వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించివచ్చారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా నిన్న రాత్రి 11.30 గంటలకు మరణించారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News