Breaking :దసరా, దీపావళికి ఉగ్రదాడులు : ఇంటలిజన్స్ బ్యూరో హెచ్చరిక
ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాదుల దాడులు దసరా, దీపావళికి జరుగుతాయని సమాచారం ఇచ్చింది.
ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఉగ్రవాదుల దాడులు దసరా, దీపావళికి జరుగుతాయని సమాచారం ఇచ్చింది. అప్రమత్తంగా ఉండాాలని ఢిల్లీ పోలీసులకు తెలిపింది. ఈ పండగల వేళ ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు దిగే అవకాశముందని హెచ్చరికలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
విదేశీయులను టార్గెట్ గా...
విదేశీయులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. అందుకే రద్దీ ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని కూడా హెచ్చరించింది. ఉగ్రమూకలు ఎంబసీలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.