రేపు మరో ప్రయోగం

రేపు పీఎస్ఎల్వీ -సీ 55 రాకెట్ ప్రయోగానికి ఇస్రో అంతా సిద్ధం చేసింది

Update: 2023-04-21 04:04 GMT

రేపు పీఎస్ఎల్వీ -సీ 55 రాకెట్ ప్రయోగానికి ఇస్రో అంతా సిద్ధం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 22 వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రెడీ అయిపోయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక పై నుండి శనివారం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ఇస్రో పీఎస్ఎల్వీ -సీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన టెల్ ఇయోస్ -2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.

మరో రికార్డు...
741 కిలోల బరువు కలిగిన సింగపూర్ ఉపగ్రహం తో పాటు 16 కిలోల లుమొలైట్ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడానికి అంతా సిద్ధం చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబందించిన కౌంట్ డౌన్ కూడా ప్రారంభం కానుంది. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేసి ప్రయోగించడం మరో రికార్డును సొంతం చేసుకోబోతుంది. ఈ ప్రయోగం కూడా విజయవంతమై ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆశిద్దాం.


Tags:    

Similar News