మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
ఇండియన్ స్సేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరో ప్రయోగానికి సిద్దమయింది. ఈఎస్ఓ - 04 ను 14వ తేదీన ప్రయోగించాలని నిర్ణయించారు
ఇండియన్ స్సేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరో ప్రయోగానికి సిద్దమయింది. ఈఎస్ఓ - 04 ను ఈ నెల 14వ తేదీన ప్రయోగించాలని నిర్ణయించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు ప్రయోగం చేయనున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను ప్రయోగానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు.
25 గంటల కౌంట్ డౌన్...
పీఎస్ఎల్వీ సిరీస్ లోని 1710 కిలో గ్రాముల ఈ ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య ధృవ కక్షలోకి ఇస్రో పంపనుంది. దీంతో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను కూడా ఈ వెహికల్ ద్వారా పంపనున్నారు. వ్యవసాయం, అటవీ, నేలపై ఉండే తేమ వంటి వాటి కోసం ఈ ప్రయోగాన్ని చేయనున్నారు. 25 గంటల పాటు దీనికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.