Heavy Rains : తమిళనాడును ముంచెత్తిన వానలు.. రెడ్ అలెర్ట్‌ను ప్రకటించిన ప్రభుత్వం

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెడ్ అలెర్ట్ ను అధికారులు ప్రకటించారు

Update: 2024-05-22 05:55 GMT

తమిళనాడులో రెడ్ అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. తమిళనాడులోని కన్యాకుమారి, టెన్ కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకూడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు.

ఊటీలో కుండతపోత...
నీలగిరి పర్వత శ్రేణుల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఊటీలోనూ కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో పర్యాటకులు గదులకే పరిమితమయ్యారు. వ్యాపారాలు కూడా ఈరోజు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో అధికార యంత్రాంగం ఉంది.


Tags:    

Similar News