Puneeth Rajkumar : రెండో వర్ధంతి.. కన్నడనాట.. మారుమోగుతున్ననినాదం
పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండేళ్లు పూర్తవుతుంది. కర్ణాటక అంతా ఆయన అభిమానులు నేడు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎవరైనా సరే.. మరణిస్తే.. కొన్ని రోజులు బాధపడతాం. కానీ ఆయన మరణించిన రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ మరువలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్. కేవలం కన్నడ సినీ పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించని నేటికి రెండేళ్లు కావస్తుంది. ఆయన చిన్న వయసులో గుండెపోటుతో మరణించారు. 2021 అక్టోబరు 29న గుండెపోటుతో మరణించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
సేవలోనూ...
కేవలం సినీ స్టార్ మాత్రమే కాకుండా ప్రజాసేవలోనూ ఆయన ముందుంటారు. బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆయన చేసిన సేవలు ఆయన మరణానంతరం వెలుగులోకి రావడంతో ఆయనకు అభిమానుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటి వరకూ ఆయన మరణాన్ని కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గుర్తు చేసుకుని మరీ రోదిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఆయన మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది.
నేడు ద్వితీయ వర్ధంతి...
ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ద్వితీయ వర్ధంతి కావడంతో కన్నడ రాష్ట్రమంతటా వర్ధంతి సభలు జరుగుతున్నాయి. ఆయన పేరిట అభిమానులు అనేక ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహిస్తూ ఆయన పట్ల తన అభిమానాన్ని చాటు కుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయనను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతూ అనేక మంది భావోద్వేగానికి గురవుతున్నారు. అప్పు లివ్స్ ఆన్ అని నెటిజన్లు వేల సంఖ్యలో ఆయనను గుర్తు చేసుకుంటుడటం ఆయనంటే ఎంత అభిమానమో చెప్పాల్పిసన పనిలేదు. అందుకే మరణించినా నేటికీ జనం హృదయాల్లో జీవించి ఉన్న పునీత్ రాజ్ కుమార్ కు "తెలుగుపోస్ట్: నివాళులర్పిస్తుంది.