ఊరట లేదు.. ధర స్వల్పంగానే తగ్గింది
ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..
బంగారం అంటే ఇష్టపడనివారుండరు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మగువల అందం పెంచేందుకే కాదు.. ఆపత్కాలంలో కూడా బంగారం ఆదుకుంటుంది. ఒకరోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు సహజం. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. అయినా కొనుగోలు దారులకు ఊరట లేదు. ఎందుకంటే 10 గ్రాములపై రూ.100 మాత్రమే తగ్గింది. ఇక కిలో వెండిపై రూ.100 మేర పెరిగింది.
ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,500 కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,550కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,700గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,000గా ఉంది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 79,800గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.79,800 వద్ద కొనసాగుతోంది.