పసిడి ప్రియులకు చేదువార్త.. భారీగా పెరిగిన బంగారం ధర
తాజాగా పెరిగిన బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ..
బంగారం ధరల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు సహజమే. మూడు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. నిన్న స్వల్పంగా తగ్గింది. తగ్గిన ధర కంటే తాజాగా పెరిగిన ధరే ఎక్కువగా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. గురువారం ఉదయం 6 గంటల వరకూ ఉన్న ధరల మేరకు.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరుగగా, 24 క్యారెట్ బంగారంపై రూ.440 మేర పెరిగింది. ఇదే సమయంలో కిలో వెండి ధర కూడా రూ.400 మేర పెరిగింది.
తాజాగా పెరిగిన బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 కి పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56000 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,080గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,980 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. చెన్నై, ముంబై నగరాలలో కిలో వెండి ధర రూ.76,800 ఉండగా, ఢిల్లీలో రూ.72,800, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ.76,800 ఉంది.