గోల్డ్ రేట్.. మళ్లీ పెరిగింది
ఈ రోజు (జూన్3) ఉదయం 6 గంటల వరకూ నమోదైన ధరల ప్రకారం..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం..
బంగారం కొనుగోలు దారులకు, పసిడి ప్రియులకు చేదువార్త. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. నేడు అంతకు రెట్టింపు పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు సాధారణం కంటే కాస్త ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే రూ.60 వేలకు తగ్గిన బంగారం ధర మళ్లీ రూ.61 వేలు దాటి.. రూ.62 వేలు దిశగా పరుగులు తీస్తోంది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.340 వరకూ పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.600 మేర పెరిగింది.
ఈరోజు (జూన్3) ఉదయం 6 గంటల వరకూ నమోదైన ధరల ప్రకారం..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,100 కు పెరిగింది. ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు చెన్నై, కేరళ లలో కిలో వెండి ధర రూ.78,600 ఉంది.