స్థిరంగానే ధరలు.. నేటి గోల్డ్ రేట్స్ ఇవిగో
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..
కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా మూడో రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలు దారులకు ఇదే మంచి సమయం. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,150గా ఉంది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 77,800గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 వద్ద కొనసాగుతోంది.