వీరిద్దరికీ పెళ్లయిందా?
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ తో డేటింగ్ లో ఇండియా టీ 20 లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఉన్నారు;
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ తో డేటింగ్ లో ఇండియా టీ 20 లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఉన్నారు. వీరిద్దరూ కలసి తిరుగుతున్న ఫొటోలను లలిత్ మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను సుస్మితాసేన్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు లలిత్ మోదీ తెలిపారు. ఇద్దరూ కలసి ప్రపంచమంతా చుట్టేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐదు పదుల వయసులో...
అయితే వీరిద్దరికీ పెళ్లయిందా? అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే లలిత్ మోదీ మాత్రం తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని, డేటింగ్ చేస్తున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు మోదీ బదులిచ్చారు. సుస్మితా సేన్ 46 ఏళ్ల వయసులో మరొక వ్యక్తితో డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ ఆమె తనకంటే 15 ఏళ్ల కంటే చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ తో డేటింగ్ చేశారు. బ్రేకప్ కావడంతో మనీలాండరింగ్ కేసులో లండన్ పారిపోయిన లలిత్ మోదీతో ప్రస్తుతం సుస్మితా సేన్ డేటింగ్ చేస్తున్నారు. లలిత్ మోదీ మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని 2010 లో ఇండియా విడిచి పారిపోయి లండన్ లో తలదాచుకున్నారు.