భక్తులతో పోటెత్తుతున్న శబరిమల

శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో దర్శనం గంటల సమయం పడుతుంది

Update: 2022-12-21 06:47 GMT

శబరిమలలో అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో దర్శనం గంటల సమయం పడుతుంది. కింద పంబ నుంచి క్యూ లైన్ కొనసాగుతుంది. దీక్షలను విరమించడానికి అయ్యప్పలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో నిలబడి ఇరుముడిని పట్టుకుని గంటల కొద్దీ అయ్యప్ప భక్తులు నిల్చోవాల్సి వస్తుంది. ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన భక్తులే కనిపిస్తున్నారు.

దర్శన సమయం పెంచినా...
భక్తుల రద్దీ పెరగడంతో హైకోర్టు ఆదేశాలతో ఆలయంలో దర్శనసమయాన్ని కూడా ఆలయ బోర్డు పొడిగించింది. రోజుకు 19 గంటల పాటు ఆలయం తెరుచుకునేలా ఏర్పాటు చేసింది. జనవరి సంక్రాంతి రోజున మకర దర్శనం తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. సంక్రాంతికి ముందుగానే దర్శనం చేసుకోవడానికి, దీక్షలను విరమించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కేటాయించిన పార్కింగ్ స్థలాలు కూడా సరిపోకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. శబరిమల దారి రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు పులిమేడు నుంచి కొండకు వెళుతున్నారు.


Tags:    

Similar News