Maha Kumbh Mela : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు ఇప్పటి వరకూ ఎంత మంది వచ్చారో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. పుణ్యస్నానాలు చేస్తున్నారు;

Update: 2025-01-16 06:23 GMT

మహా కుంభమేళాకు జనం అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అందుకు తగినట్లుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కేవలం భారత్ నుంచి మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఒక్కరోజులోనే మూడు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ కు రావడంతో ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. వరస సెలవులు రావడంతో పాటు ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు చేస్తే ముక్తి లభిస్తుందని భావించిన అనేక మంది యూపీ బాట పట్టారు.

సాధువులు, అఘోరాలతో...
ఇక ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఆధ్యాత్మిక పీఠాధిపతులు, సాధువులు, అఘోరాలు, అఖాడాలు, నాగ సాధువులు, సంతులు చాలా మంది తరలివస్తున్నారు. చూసేందుకు జన జాతరను తలపిస్తుంది. రోజుకు కోట్లాది మంది వస్తుండటంతో భక్తులు పుణ్యస్నానాలుచేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పది కోట్ల మంది పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు నలభై కోట్ల మంది ఈ మహా కుంభమేళాకు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లతో పాటు అన్ని రకాలుగా సౌకర్యాలను కల్పించింది.
అన్ని రకాల ఏర్పాట్లు...
మహా కుంభమేళాకు వచ్చే భక్తులకు తాగునీరు, వసతి, భోజనం వంటి వాటికి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నదిలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక బోట్లలో పోలీసులు, గజ ఈతగాళ్లు పహారా కాస్తున్నారు. కాలినడకన ఘాట్ కు చేరుకోవడానికి కొంత వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు పది కిలోమీటర్లు నడిస్తేగాని ఘాట్ కు చేరుకోలేకపోవడంతో కొంత ప్రయాసపడి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. అలాగే కోట్లాది మంది తరలి వస్తుండటంతో అక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. వైద్య బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రయాగరాజ్ లో కుంభమేళా యాభై ఐదు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేసి భద్రత చర్యలు చేపట్టారు. మెడికల్ క్యాంప్ లు మాత్రమే కాకుండా మినీ ఆసుపత్రులనుకూడా ఏర్పాటు చేసి అవసరమేతే శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.మొత్తం మీద ప్రయాగరాజ్ కు కోట్లాది మంది భక్తులు తరలి వస్తుండటంతో జనజాతరను తలపిస్తుంది.



Tags:    

Similar News