Richest Politician in India: పార్లమెంటులో మొనగాళ్లు మనోళ్లే

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశంలో పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు.

Update: 2024-06-07 07:21 GMT

Richest Politician in India:లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశంలో పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే దేశంలోనే తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే అత్యంత ధనిక పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఎంపికైన  పార్లమెంటు సభ్యులలో 93 శాతం మంది కోటీశ్వరులే. ఈ విషయాన్నీ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తెలిపింది.

ఇద్దరూ అత్యంత ధనిక వంతులు...
గత పార్లమెంటు ఎన్నికల్లో 474 మంది మిలియనీర్లు ఉండగా, ఈసారి దాని సంఖ్య 504కు పెరిగింది. మొత్తం ఎంపీల సంఖ్య 543. ఇందులో 504 మంది కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తెలిపింది. దేశంలోనే అత్యంత ధనిక పార్లమెంటు సభ్యులుగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు 5,705 కోట్ల రూపాయల ఆస్తులుండగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 4,568 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కాబట్టి మొదటి, రెండు స్థానాలు మన తెలుగు ఎంపీలే.


Tags:    

Similar News