మహాభారత్ సీరియల్ ఫేమ్, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కన్నుమూత

ప్రవీణ్ కేవలం నటుడే కాదు. గొప్ప అథ్లెట్ కూడా. ఆయన పలు ఈవెంట్లలో హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో భారత్ కు

Update: 2022-02-08 06:26 GMT

"మహాభారత్" సీరియల్ లో భీముడి పాత్రను పోషించి, తన నటనతో యావత్ భారతాన్ని అలరించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి(74) ఇక లేరు. గుండెపోటు కారణంగా ఆయన ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 10 నుంచి 10.30 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

కాగా.. ప్రవీణ్ కేవలం నటుడే కాదు. గొప్ప అథ్లెట్ కూడా. ఆయన పలు ఈవెంట్లలో హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో భారత్ కు ప్రాతనిధ్యం వహించారు. అలాగే ఏషియన్ గేమ్స్ లో నాలుగు పతకాలు సాధించారు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 1966లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో హ్యామర్ థ్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. 1988లో బీఆర్ చోప్రా నిర్మించిన 'మహాభారత్' సీరియల్ తో ఆయన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు.


Tags:    

Similar News