మహా కుంభమేళ ప్రారంభం రేపటి నుండే...!!

12 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది;

Update: 2025-01-12 08:55 GMT

12 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ రాజ్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది..!!

జనవరి 13 నుండి ఫిబ్రవరి వరకు ఈ మహా కుంభమేళా జరుగుతుంది..!!

గంగా, యమునా మరియు సరస్వతీ నదుల సంగమమైన పవిత్ర నదుల ఒడ్డున సుమారు 12 సంవత్సరాల తర్వాత ప్రయాగ యొక్క పవిత్ర భూమిపై మరోసారి నిర్వహించబడుతుంది.,!!!

మహా కుంభమేళ సన్నాహాలకు సంబంధించి మీడియాని ఉద్దేశించి ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ..,"" ఇది స్వచ్చమైన, ఆరోగ్యకరమైన, సురక్షితమైన మహా కుంభంగా ఉంటుంది ..!!!

దాదాపు 40 కోట్లకు పైగా భక్తులు దేశ,విదేశాల నుండి వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నారు..!!

ఈ ప్రక్రియలో భాగంగా త్రివేణి సంగమం వద్ద 12 కిలో మీటర్ల మేర తాత్కాలిక ఘాట్లు మరియు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం దాదాపు రెండు లక్షల టెంట్లు నిర్మించింది..!!

అలాగే కొత్తగా విజృంభిస్తున్న వైరస్ ని వ్యాప్తి చెందనీయకుండా, కుంభమేళ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు..,15 వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించింది....!!!

ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు నేడు ఉత్తరప్రదేశ్ కార్మిక మంత్రి అనిల్ రాజ్‌భర్ తెలంగాణలోని బండి సంజయ్ ను కలిశారు. అనంతర మహా కుంభమేళ కు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..!!

Tags:    

Similar News