Breaking : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ 18 మంది మావోల మృతి
ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మరణించారు;

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్ చేస్తుండగా ఎదురు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
ఎదురుకాల్పుల్లో...
భద్రతాదళాలు, మావోయిస్టులు మధ్య ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు సాగిందని తెలిసింది. అయితే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించడంతో మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా ఛత్తీస్ ఘడ్ లో భారీగా ఎన్ కౌంటర్లు జరుగుతూ పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. మరోసారి మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.