భారీ ఎన్ కౌంటర్... 30 మంది మావోల మృతి.. ఎన్ కౌంటర్ కి అదే కారణమా?

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముప్ఫయి మంది మావోయిస్టులు మరణించారు;

Update: 2025-03-20 11:45 GMT
encounter,  thirty maoists died, summer,  chhattisgarh
  • whatsapp icon

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముప్ఫయి మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఉదయం నుంచి ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్ చేస్తుండగా ఎదురు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

ఎదురుకాల్పుల్లో...
భద్రతాదళాలు, మావోయిస్టులు మధ్య ఎన్ కౌంటర్ కొన్ని గంటల పాటు సాగిందని తెలిసింది. అయితే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించడంతో మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా ఛత్తీస్ ఘడ్ లో భారీగా ఎన్ కౌంటర్లు జరుగుతూ పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. మరోసారి మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి దాదాపు అరవై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.
ఎండల తీవ్రతతో..
ఎండల తీవ్రత ముదరడంతో మావోయిస్టులకు అడవుల్లో ఉండటం ఇబ్బందికరంగా మారింది. తాగునీటికోసం కూడా ఇబ్బందులు పడే అవకాశమున్నందున వారు మైదాన ప్రాంతాల్లోకి వచ్చే అవకాశముందని ముందుగానే గుర్తించిన భద్రతాదళాలు అందుకు అనుగుణంగా పక్కా ప్లాన్ తో అడవుల్లో కూంబింగ్ ను చేపట్టారు. ఇప్పటి వరకూ 26 మృతదేహాలను స్వాధీనంచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పాటు భారీగా ఆయుధాలను కూడాస్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.


Tags:    

Similar News