Metro Train: మెట్రో స్టేషన్‌లో షాకింగ్‌ ఘటన.. పట్టాలు దాటుతుండగా..

చాలా మంది రైలు ఎక్కే ముందు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులే ప్రాణాల మీదకు వస్తుంటుంది. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతోంది చాలా మందికి.

Update: 2023-11-29 16:31 GMT

చాలా మంది రైలు ఎక్కే ముందు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులే ప్రాణాల మీదకు వస్తుంటుంది. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతోంది చాలా మందికి. తొందరలో వెళ్లాలనే అతృత ప్రాణాలమీదకు తెచ్చింది. సాధారణంగా మెట్రో రైలు ట్రాక్‌ దాటరాదని, ప్రమాదమని, ఒక వేళ మెట్రో ట్రాక్‌ దాటినట్లయితే అందుకు జరిమానా లేదా జైలు శిక్ష పడుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో మెట్రో స్టేషన్‌లో కనిపిస్తుంటాయి. అయినా కొందరు వాటిని పెడచెవిన పెట్టి ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కూడా ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి ఫ్లాట్ ఫారమ్కు రైలు మధ్య నలిగి నరకయాతన అనుభవిస్తున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నవంబర్‌ 25న ఢిల్లీలోని ఛతర్ పూర్ మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకంది.

ఉత్తరప్రదేశ్కు చెందిన భూరాసింగ్ (38) రైలు క్యాచ్ చేయాలనే హడావుడిలో రైలు పట్టాలు దాటుతూ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఢిల్లీ మెట్రోరైలు ఎక్కి ఛతర్ పూర్ మెట్రో స్టేషన్లో దిగాడు. ఒకటో నెంబర్ ప్లాట్ పారమ్పై దిగిన ఆయన.. రెండో ఫ్లాట్ ఫారమ్ చేరుకోవాలన్న హడావుడిలో ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే రెండో ప్లాట్‌ఫామ్‌ చేరుకునేందుకు లిప్ట్‌గానీ, మెట్లను గానీ ఉపయోగించకుండా ఇలా ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే రైలు వచ్చే సమయానికి ఈ ప్రయత్నాలు చేశాడు ఈ మహానుభావుడు. మెట్రో ట్రాక్ దాటుతుండగా తనవైపు రైలు రావడంతో తప్పించుకోడానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంతలో ఓ మహిళ అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.


భూరాసింగ్ రైలుకు, ఫ్లాట్ ఫారానికి మధ్య నలిగి పోగా, అతన్ని రైలు కొంత దూరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. అప్పటికే భూరాసింగ్ శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది. ఫ్లాట్ ఫారమ్ మధ్య ప్రాణాలు విడిచాడు. అందుకే లాంటి స్టంట్స్‌ చేయకుండా సరైన మార్గంలో వెళ్లడం మంచిది. అది రైల్వే స్టేషన్‌ అయినా, బస్‌ స్టేషన్‌ అయినా, రోడ్డు మార్గమైనా జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకుంటే భష్ట్రరాసింగ్‌ లాగే మీ ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. సో.. జాగ్రత్త.

Tags:    

Similar News