సండే.. బంగారం ధర దిగివస్తోంది

వరుసగా మూడవరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై..

Update: 2023-05-28 03:18 GMT

ధర తక్కువగా ఉన్నప్పుడు కొని.. పెరిగినపుడు అమ్ముకుంటే లాభం తెచ్చే వస్తువుల్లో బంగారం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి మించి.. వేరే వస్తువులకు కొనేటపుడు గానీ.. అమ్మేటపుడు గానీ అంత గిరాకీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం ధరలు తగ్గినపుడు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారు. వరుసగా మూడవరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.100 తగ్గింది. ఆదివారం (మే28) ఉదయం 6 గంటల వరకు నమోదైన బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.60,600 కు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.55,940, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.61,040గా ఉంది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.800 మేర పెరగడంతో.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.77,000కు చేరింది.


Tags:    

Similar News