స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..;
బంగారాన్ని ఇష్టపడని వారుండరు. పెళ్లైనా, ఇతర ఫంక్షనైనా మగువలు సింగారించుకునేది బంగారపు నగలతోనే. కొందరు అలంకరణ కోసం బంగారం కొంటే.. ఇంకొందరు ఆపత్కాలంలో అది ఆదుకుంటుందని ధర తక్కువ ఉన్నప్పుడే కొనుక్కుంటూ ఉంటారు. మూడు రోజులు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,650 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 గా ఉంది.
బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, ముంబైలో రూ.73,000, ఢిల్లీలో రూ.73,000, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ నగరాల్లో రూ.77,000 ఉంది.