ధరల్లో మార్పులేదు.. ఇప్పుడే కొనుక్కోండి

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం..

Update: 2023-05-30 03:07 GMT

gold price today

బంగారం కొనుగోలు దారులకు ఇదే మంచి అవకాశం. మూడు రోజులు వరుసగా స్వల్పంగా ధర తగ్గుతూ వచ్చిన బంగారం.. నిన్న స్థిరంగా ఉంది. నేడు కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. మూడురోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు లేవు. అయితే త్వరలోనే బంగారం ధర పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడే కొనుక్కోవడం మంచిది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ధర పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేటి (మే30) ఉదయం 6 గంటల వరకూ నమోదైన వివరాల ప్రకారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,550 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,650 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 గా ఉంది. బంగారంతో పాటు వెండి కూడా స్థిరంగానే కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, ముంబైలో రూ.73,000, ఢిల్లీలో రూ.73,000, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ.77,000 ఉంది.


Tags:    

Similar News