మళ్లీ తగ్గిన బంగారం.. ఈసారి ఎంతంటే..?
తాజాగా తగ్గిన బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ..
బంగారం ధర స్థిరంగా ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంది. ఒక్కోసారి స్థిరంగా కొనసాగుతుంటుంది. వరుసగా రెండ్రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం.. మూడురోజులు స్థిరంగా కొనసాగింది. తాజాగా మళ్లీ స్వల్పంగా తగ్గింది. బంగారం కొనుగోలు దారులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మళ్లీ ధరలు పెరిగితే.. ఎప్పటికీ తగ్గుతాయోనని ఎదురుచూడాల్సి వస్తుంది. కొద్దిరోజుల క్రితం రూ.62 వేలకు చేరిన 10 గ్రాముల బంగారం .. ఇప్పుడు రూ.60,500 లకు తగ్గింది.
తాజాగా తగ్గిన బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,490 కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,600 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,630గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,530 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, ముంబైలో రూ.72,000, ఢిల్లీలో రూ.72,600, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ.76,500 ఉంది.