నేడు ఎన్నికల కమిషనర్ల నియామకంపై సమావేశం

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సమావేశం నేడు జరగనుంది

Update: 2024-03-14 04:42 GMT

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్‌వాల్ లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం చీఫ్ ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఇద్దరు కమిషనర్లను ఎంపిక చేయాలని ఈ సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వీరి నియామకం త్వరగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిచింది.

సుప్రీంకోర్టులో...
ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తప్పించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశంలో ఇద్దరు కమిషనర్ల ఎంపిక జరగనుందిద. మరోవైపు కొత్త చట్ట ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దంటూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ రేపు విచారణకు రానున్న తరుణంలో నేడు జరుగుతున్న సమావేశం కీలకంగా మారనుంది. రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది


Tags:    

Similar News