48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్
మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేయాలని నిర్ణయించింది.
మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాల్లో ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. శాంతిభద్రతలను పరిరక్షించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకుంది.
శాంతి భద్రతల దృష్ట్యా....
అసోం - మేఘాలయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల కారణంగా ఆరుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జైంతియా హిల్స్, ఈస్ట్ జైంతియా హిల్స్, ఈస్ట్ ఖాసీ హిల్స్, రి భోయ్, ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్ , నైరుతి ఖాసీ హిల్స్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే మరింత సమయం ఇంటర్నెట్ సేవలను బంద్ చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.