రుణ గ్రహితలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.

Update: 2023-06-08 05:34 GMT

RBI Repo Rates

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రుణాలు తీసుకున్న వారికి శుభవార్త చె్పింది. వడ్డీరేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో కోట్లాది మంది కస్టమర్లకు రిలీఫ్ లభించింది. ప్రతి ఏడాది మాదిరి.. ఈ ఏడాది కూడా ఆర్బీఐ లోన్లపై వడ్డీరేట్లు పెంచుతుందని ఆందోళన చెందిన వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. 43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. రెపోరేటు మునుపటి స్థాయిలోనే స్థిరంగా కొనసాగిస్తున్నట్లు గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ వెల్లడించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గినందుకే వడ్డీ రేట్లను పెంచలేదని వివరించారు. గతేడాది ఏప్రిల్ సమావేశంలో రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగి రావడంతో వడ్డీరేట్లను యథాతదంగానే కొనసాగిస్తుంది. వరుసగా రెండోసారి వడ్డీరేట్లను కొనసాగిస్తుండటం విశేషం.





Tags:    

Similar News