ఆ డబ్బంతా పేదలకు పంచి పెట్టాలని ఉంది : మోదీ

దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న నగదును పేదలకు పంచిపెట్టాలన్న ఆలోచనలో తాఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు

Update: 2024-05-17 06:21 GMT

ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న నగదును పేదలకు పంచిపెట్టాలన్న ఆలోచనలో తాము ఉన్నామని తెలిపారు. ఈడీ దేశంలో కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకుంటుందని, వాటిని పేదలకు పంచిపెట్టాలని, అందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈడీ కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా ఉందని, తమ హయాంలో నల్లధనాన్ని వెతికి తీస్తుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈడీ సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.

న్యాయపరమైన సలహాలు...
గత పదేళ్ల యూపీఏ పాలనలో ఎందరో పేదల సొమ్మును దోచుకున్నారని, ఆ డబ్బంతా తిరిగి పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయబృందం సలహాలను కూడా తీసుకుంటామని చెప్పారు. ఈడీ స్వాధీనం చేసుకున్న సొత్తును పేదలకు ఇవ్వాలంటే ఏం చేయాలో సూచించాలని తాము ఇప్పటికే న్యాయనిపుణులను సలహాను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.


Tags:    

Similar News