Toll Fees : టోల్ ఫీజులు పెంచేశారు.. ఎప్పటి నుంచి అంటే?
దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది
దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. జూన్ 2వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఫీజులను నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పెంచుతుంటుంది. రహదారుల నిర్వహణ కోసం ఈ ఛార్జీలను పెంచుతూ వస్తున్నారు. అయితే ఎన్నికలు ఉన్నందున టోల్ ఛార్జీలను మొన్నటి వరకూ పెంచలేదు. ఎన్నికల సంఘం ఆదేశాలతో టోల్ ఛార్జీల పెంపుదలను వాయిదా వేసింది.
జూన్ 2వ తేదీ నుంచి...
ఎన్నికలు జూన్ ఒకటోతేదీతో ముగియనుండటంతో జూన్ రెండో తేదీ నుంచి టోల్ ఫీజులను పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు టోల్ ప్లాజా నిర్వాహకులకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. టోల్ ఫీజులను ప్రస్తుతమున్న దానికంటే ఐదు శాతం పెంచినట్లు చెబుతున్నారు. అసలే రవాణా వాహనాలు పెట్రోలు ధరలతో నిత్యావసరాలు పెరిగిపోయాయి. టోల్ ప్లాజా ధరలను కూడా పెంచుతుండటంతో నిత్యావసరాలు మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.