కరోనా అవుట్ బ్రేక్.. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 20 వేల కేసులు
తాజాగా ఢిల్లీలో ఒక్కరోజే 20 వేల కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్
దేశంలో కరోనా కోరలు చాచింది. దానిపట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వారిపై అమాంతం దాడి చేస్తూ రెచ్చిపోతోంది. దానికితోడు ఒమిక్రాన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఢిల్లీలో ఒక్కరోజే 20 వేల కోవిడ్ కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు 19 శాతంగా ఉందని పేర్కొన్నారు.
Also Read : నేటి నుంచి మూడ్రోజులు తెలంగాణకు వర్షసూచన
గురువారం కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్న రోగులందరిలో కమోర్బిడిటీస్ ఎక్కువగా ఉన్నాయని సత్యేందర్ జైన్ అన్నారు.ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ ఒమిక్రాన్ వేరియంట్ మరణం సభవించలేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. ఇప్పటి వరకూ ఢిల్లీ హాస్పిటల్స్ లో 10శాతం బెడ్లు మాత్రమే కోవిడ్ రోగులతో నిండాయని తెలిపారు. చాలామంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకుంటుండటంతో.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తగ్గిందని చెప్పుకొచ్చారు.