Elections : నేడు మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్

మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది.

Update: 2024-04-12 03:31 GMT

మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. మొత్తం పన్నెండు రాష్ట్రాలలో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. దీంతో పాటు మధ్యప్రదేశ్ వాయిదా పడిన వాటికి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మే 7న పోలింగ్ జరగనుంది. మూడోదశ నోటిఫికేషన్ విడుదలయిన వెంటనే నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

94 స్థానాలకు...
నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 19వ తేదీ వరకూ నిర్ణయించారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు పరిశీలనను ఈ నెల 20వ తేదీన చేస్తారు. ఉపసంహరణకు 22వ తేదీగా నిర్ణయించారు. మే 7వ తేదీ వీటికి సంబంధించి పోలింగ్ జరగనుంది. జూన్ నాలుగో తేదీ ఫలితాలు వెలువడనున్నాయి.


Tags:    

Similar News