భారత్ లో ఆగని ఒమిక్రాన్.. పెరుగుతున్న కేసులు
భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.;
భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ప్రస్తుతం భారత్ లో 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,805 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. అయితే ఒమిక్రాన్ బాధితులు అతి తక్కువ మంది మరణిస్తున్నారు.
అత్యధికంగా...
ప్రస్తుతం భారత్ ను ఒమిక్రాన్ వణికిస్తుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,281 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ లో 645, ఢిల్లీలో 547, కర్ణాటకలో 479 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రేపు ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా ఒమిక్రాన్ కేసులుపై చర్చించనున్నారు.