Bihar : బీహార్‌లో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి...21 మంది అరెస్ట్

బీహార్‌లో కల్తీ మద్యం తాగి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుూనే ఉంది

Update: 2024-10-21 02:13 GMT

బీహార్‌లో కల్తీ మద్యం తాగి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుూనే ఉంది. తాజాగా 37 మంది కల్తీ మద్యం తాగి మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చిన మద్యం గా నిర్ధారణ అయింది. మష్రాఖ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కూడా విధి నిర్వహణలో ఫెయిల్ అయినందుకు ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మఘర్, ఔరియా, ఇబ్రహీంపూర్ ప్రాంతాలకు చెందిన వాచ్‌మెన్‌లను ముగ్గురిని సస్పెండ్ చేశారు.

వందల మంది మృత్యువాత...
అయితే ఈ మద్యం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చి తాగినట్లుగా గుర్తించారు. కొరియర్ ద్వారా ఈ మద్యం వచ్చినట్లు పోలీసులు విచారణ కనుగొని ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నారు. అక్టోబర్ 15వ తేదీన సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 37 మంది వరకూ మరణించారు. బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నందున ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకుని వచ్చి ఇక్కడ తాగుతున్నారు. దీంతో చాలా మంది అశువులు బాస్తున్నారు. ఇప్పటికే 2016 లో మద్యం నిషేధం విధించిన తర్వాత ఇప్పటి వరకూ వందల సంఖ్యలో కల్తీ మద్యం తాగి మరణించారు. ప్రభుత్వం మద్య నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది.


Tags:    

Similar News