ఫిబ్రవరి 28 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం

పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లను పునః ప్రారంభించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యార్థులు క్రమంగా

Update: 2022-02-11 09:59 GMT

మాయదారి కరోనా మహమ్మారి విద్యార్థుల చదువులపై ఎంత ప్రభావాన్ని చూపుతోందో తెలిసిందే. తాజాగా జరిగిన ఓ సర్వేలో కూడా.. కరోనా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిందని, నెలల తరబడి స్కూళ్లు మూతపడటంతో చాలా మంది విద్యార్థులు చదువుపై ఆసక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆన్ లైన్ తరగతులకు, ఆఫ్ లైన్ తరగతులకు చాలా తారతమ్యం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లను పునః ప్రారంభించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యార్థులు క్రమంగా స్కూళ్లకు హాజరవుతున్నారు.

ఒడిశా ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 28 నుంచి పూర్తిస్థాయిలో స్కూళ్లను పునః ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 7వ తరగతి విద్యార్థుల వరకూ.. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. మిగతా విద్యార్థులకు ఫిబ్రవరి 27 వరకూ ఆన్ లైన్ తరగతులు జరుగుతాయని, ఫిబ్రవరి 28 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు పునః ప్రారంభమవుతాయని బిష్ణుపాద సేధి తెలిపారు.



Tags:    

Similar News