భారత్ ను ఊపేస్తున్న ఒమిక్రాన్

భారత్ లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.;

Update: 2022-01-11 04:40 GMT

భారత్ లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఎన్ని ఆంక్షలు విధించినా ఒమిక్రాన్ వ్యాప్తి ఆగడం లేదు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయినా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

ఎక్కువగా....
దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 1,247, రాజస్థాన్ లో 645, ఢిల్లీలో 546, కర్ణాటకలో 479, కేరళలో 350, ఉత్తర్ ప్రదేశ్ లో 275 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయితే 1,711 మంది బాధితులు కోలుకున్నారు.


Tags:    

Similar News