కరోనా న్యూ వేరియంట్ : మాస్కులు తీయొద్దంటూ హెచ్చరిక !
ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ వేరియంటే ఎక్స్ఈ. బీఏ.2 వేరియంట్ కంటే ఇది 10 శాతం వేగంగా..
న్యూ ఢిల్లీ : కరోనా తగ్గుముఖం పడుతుందని, ఇక మాస్కులు ధరించాల్సిన అవసరం ఉండదని యావత్ ప్రపంచం సంబరపడుతోన్న వేళ.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా పేర్కొంటున్న ఎక్స్ఈ వేరియంట్ ప్రజలను మళ్లీ భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితమే డబ్ల్యూహెచ్ఓ ఈ వేరియంట్ పై అధికారిక ప్రకటన చేసింది. ఎక్స్ఈకి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో..నిపుణులు అప్రమత్తమయ్యారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన 'బీఏ.1, బీఏ.2'ల మిశ్రమ వేరియంటే ఎక్స్ఈ. బీఏ.2 వేరియంట్ కంటే ఇది 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసేందుకు ఇంకా సమయం ఉందని, ప్రస్తుతానికి మాస్కులు తీయకపోవడమే శ్రేయస్కరమని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ లోనూ విజృంభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు.