పార్లమెంట్‌ వద్ద 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాల మోహరింపు

Parliament security: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు

Update: 2024-01-25 11:07 GMT

Parliament security

Parliament security: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు దగ్గర పడుతుండటంతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. బడ్జెట్ సెషన్‌లో వచ్చేవారిని పరీక్షించేందుకు 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మోహరించారు. దీనితో పాటు, పార్లమెంట్ భవనం ఆవరణలో ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవద్దని పార్లమెంట్ ఉద్యోగులను ఆదేశించింది సెక్యూరిటీ ఫోర్స్‌.

ఈ మేరకు జనవరి 19న సర్క్యులర్ జారీ అయ్యింది. భారతదేశంలోని అత్యంత సున్నితమైన ప్రదేశాలలో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ ఒకటి. ఇందులో భాగంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఫోటోగ్రఫీ, వీడియో మేకింగ్‌పై నిషేధం ఉంది.

ఇక్కడ కెమెరాలు, స్పై కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు క్యాంపస్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని సీఐఎస్‌ఎఫ్‌ పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లోని అన్ని అధికారులు, ఉద్యోగులకు, పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న ఇతర సహాయక ఏజెన్సీలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఫోటోగ్రఫీపై పూర్తి నిషేధం విధించనున్నట్లు తెలిపింది. పార్లమెంట్‌లో అడుగడుగునా భద్రతా ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మొత్తం 140 మంది సీఐఎస్‌ఎఫ్‌స ఇబ్బందిని ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో బడ్జెట్ సెషన్‌లో సిబ్బంది లగేజీని క్షణ్ణంగా పరీక్షిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సోమవారం నుంచి 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పార్లమెంట్‌ భవన సముదాయం భద్రతను చేపట్టారు.

ఇదిలా ఉండగా, సిఐఎస్‌ఎఫ్‌లో దాదాపు 1.70 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు. అయితే పార్లమెంట్‌ భద్రత కోసం శాశ్వత ప్రాతిపదికన 140 మంది సిబ్బంది కావాలని ఫోర్స్‌ కేంద్ర హోం మంత్రిత్వశాఖను కోరింద. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా 140 మంది సిబ్బందిని నియమించారు.

Tags:    

Similar News