Loksabha : 24 నుంచి జులై 3వరకూ పార్లమెంటు సమావేశాలు

ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు;

Update: 2024-06-19 07:43 GMT
Loksabha : 24 నుంచి జులై 3వరకూ పార్లమెంటు సమావేశాలు
  • whatsapp icon

ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 24 నుంచి జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. నూతనంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యులతో ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు.

స్పీకర్ ఎన్నిక....
కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం ఈ నెల 24, 25 తేదీల్లో ఉంటుందని కిరణ్ రిజిజు వివరించారు. 26వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగ నుందని, 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర పతి ముర్ము ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు విపక్షాల సహకారం కోరుతున్నట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News