Parliament Sessions : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు.. హాట్ హాట్ గానే?

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి

Update: 2024-07-22 02:19 GMT

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు విపక్షాల సభ్యుల సంఖ్య కూడా బలంగా ఉండటంతో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ అంశాలపై...
ఇటీవల వరసగా రైల్వ ప్రమాదాలు జరుగుతుండటంతో రైల్వే భద్రతపై కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో కూడా నిలదీతకకు సిద్ధమయ్యాయి. దీంతో పాటు కావవడి యాత్ర మార్గలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలన్న నిబంధన వంటి అంశాలపై విపక్షాలు ప్రశ్నించనుంది. దీంతో పాటు సంప్రదాయంగా అనుసరించే డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కూడా పట్టుబట్టనున్నారు. అదే సమయంలో విపక్షాలుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఏ అంశంపైనైనా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు పాలకపక్షం సిద్ధమవుతుంది.
కీలక బిల్లులపై...
పాలకపక్షం పలు కీలక బిల్లులను ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనుంది. దీనిపై కూడా విపక్షాలు అభ్యంతరం చెప్పే అవకాశాలున్నాయి. గతంలోలా అధికార పక్షానికి మాత్రం అంత సులువుగా లేదు. సమావేశాలను సజావుగా నిర్వహించాలంటే కత్తిమీద సామే అవుతుంది. అందుకే ఈ సమావేశాలు అధికార, విపక్షాలు రెండూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తాయి. సభ సజావుగా సాగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు అధికార పార్టీని నిలదీసిన నేపథ్యంలో మరి ఈ సమావేశాలు ఎలా సాగుతాయన్నది చూడాల్సందే.


Tags:    

Similar News