పెరిగిన పెట్రోలు, వంటగ్యాస్ ధరలు

దేశంలో పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. చాలా రోజుల తర్వాత పెట్రోలు ఉత్పత్తుల ధరలను చమరుసంస్థలు పెంచేశాయి

Update: 2022-03-22 02:11 GMT

దేశంలో పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. చాలా రోజుల తర్వాత పెట్రోలు ఉత్పత్తుల ధరలను చమరుసంస్థలు పెంచేశాయి. లీటర్ పెట్రోలుపై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 109,10 రూపాయలు, లీటరు డీజిల్ ధర 95.49 రూపాయలుగా ఉంది. మరోవైపు కేంద్రం వంటగ్యాస్ ధరను కూడా పెంచింది.14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత.....
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో పెట్రో ఉత్పత్తుల ధరలను చమురు సంస్థలు ఐదు నెలలుగా పెంచలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వీటి ధర పెరుగుతుందని అందరూ ఊహించిందే. ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో పెంచడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కారణంగా ముడిచమురు ధర పెరగడంతో వీటి ధరను పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు చెబుతున్నాయి.


Tags:    

Similar News