నిజామాబాద్ కుట్రకేసు : పీఎఫ్ఐ కీలక నేత అరెస్ట్

నిజామాబాద్ పీఎఫ్ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్, ఏపీ, తెలంగాణ పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ..

Update: 2023-06-14 13:11 GMT

నిజామాబాద్ కుట్రకేసులో కీలక నిందితుడు, నంద్యాలకు చెందిన పీఎఫ్ఐ కీలక నేత మహ్మద్ యూనస్ ను కర్ణాటకలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో కేసు నమోదు చేసి, పీఎఫ్ఐ పై దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 16 మంది అరెస్ట్ చేసి.. అందరిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. వారంతా ఇచ్చిన సమాచారంతో తాజాగా యూనస్ ను కర్ణాటకలో అరెస్ట్ చేశారు.

నిజామాబాద్ పీఎఫ్ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్, ఏపీ, తెలంగాణ పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో అతను నంద్యాలలో తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్ దుకాణంలో పనిచేశాడు. గతేడాది సెప్టెంబర్ లో ఎన్ఐఏ సోదాలు చేస్తున్న సమయంలో భార్య, పిల్లలతో సహా కర్ణాటకలోని బళ్లారికి మకాం మార్చాడు. అక్కడ బషీర్ గా పేరుమార్చుకుని ప్లంబర్ గా పనిచేస్తూ.. కోడ్ భాషతో ఉగ్రమూకలతో సంభాషణలు జరుపుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో యూనస్ ను అరెస్ట్ చేయగా.. షేక్ ఇలియాస్ అనే మరో వ్యక్తితో కలిసి తాను తెలుగురాష్ట్రాల్లోని పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు అంగీకరించాడు యూనస్. ఇలియాస్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతనికోసం ఎన్ఐఏ బృందాలు గాలిస్తున్నాయి.


Tags:    

Similar News