Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2024-12-30 06:12 GMT



 


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించినందుకు ఆయనపై కేసు నమోదయింది. బీహార్ లో విద్యార్థుల నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. జనస్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఈ ర్యాలీకి నాయకత్వం వహించారని ఆయనపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిరసన ర్యాలీలో...


పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించే సందర్భంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రశాంత్ కిషోర్ తో పాటు మరో 700 మందిపైగా విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేవారు. నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News