రెండు రోజుల పాటు ప్రధాని విదేశీ పర్యటన
నేడు థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు;

నేడు థాయ్‌లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. థాయ్ లాండ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునే వీలుందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
శ్రీలంకలోనూ...
అక్కడి నుంచి శ్రీలంక లోనూ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ప్రధాని మోదీ పర్యటన ఇదే ప్రధమం కావడంతో ఆసక్తికరంగా మారింది. కొత్త అధ్యక్షుడు, ప్రధానితో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల విదేశీ పర్యటన తర్వాత తిరిగి భారత్ కు చేరుకోనున్నారు.