నారీశక్తి వందన్ పేరుతో మహిళ బిల్లు : మోదీ

కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేరోజన్నారు.

Update: 2023-09-19 08:33 GMT

కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేరోజన్నారు. దేశంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకునేలా అడుగులే వేస్తున్నామన్న మోదీ మరో అడుగు వేయడానికి సిద్ధమయ్యాయనని తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ పేరును పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళ రిజర్వేస్ల విషయంలో మరో అడుగు ముదుకు వేయబోతున్నామని తెలిపిన మోదీ ఈ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు.

మహిళ రిజర్వేషన్ బిల్లుకు...
1996లో మహిళ రిజర్వేషన్ బిల్లు సభ ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకూ ఆమోదం పొందలేదని ఆయన అన్నారు. ఈరోజు మహిళ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. నారీశక్తి బిల్లును ఆమోదింప చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్న మోదీ, నారీ శక్తి బిల్లును చట్టం చేయడానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. నారి శక్తి బిల్లుతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోగలమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ బిల్లు ఎంపీలకు అగ్ని పరీక్ష అని మోదీ తెలిపారు. అందరూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపి మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు.


Tags:    

Similar News