‍Narendra Modi : అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆయన క్యాడ్‌ లీడర్ల సమ్మిట్ లో పాల్గొననున్నారు

Update: 2024-09-21 02:40 GMT

narendra modi 

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆయన క్యాడ్‌ లీడర్ల సమ్మిట్ కు హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని మోదీ ఎనిమిది సార్లు అమెరికాను మోదీ వెళ్లారు. ఈరోజు డెలావేర్ లోని విల్లింగ్గన్‌లో జరగనున్న క్యాడర్ లీడర్ల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.

క్యాడ్ లీడర్ల సమ్మిట్‌కు...
ఈ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆతిధ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ అంతర్జాతీయ సమస్యలపై క్యాడ్ లీడర్ల సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తుండటంతో అక్కడి భారతీయులు పెద్దయెత్తున స్వాగతం పలకనున్నారు.


Tags:    

Similar News