Narendra Modi : నేడు ఉత్తర్‌ప్రదేశ్ లో మోదీ ప్రచారం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు;

Update: 2024-05-16 03:37 GMT
bjp leaders, telangana, campaign, varanasi, election campaigning
  • whatsapp icon

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. యూపీలో అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో నేడు ప్రధాని యూపీ పర్యటన సాగనుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్‌పూర్, భదోహి, ప్రతాప్‌గడ్ లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు.

గెలుపే లక్ష్యంగా...
ఉదయం పది గంటల నుంచి ప్రధాని పర్యటన యూపీలో ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలలో కూడా ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News