దీపావళి కానుక ఇచ్చేందుకు సిద్ధమైన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ యువతకు దీపావళి కానుకను అందించనున్నారు. 75 వేల మంది యువతకు నియామక పత్రాలను అందచేయనున్నారు

Update: 2022-10-20 07:55 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ యువతకు దీపావళి కానుకను అందించనున్నారు. 75 వేల మంది యువతకు నియామక పత్రాలను అందచేయనున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ వారికి స్వయంగా అపాయింట్‌మెంట్ లెటర్స్ అందచేస్తారని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ ఇటీవల పది లక్షల ఉద్యోగాలను రానున్న 18 నెలల కాలంలో భర్తీ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 75 వేల మందిని నియమించారు.

ఈ రంగాల్లో ఎంపికయిన...
వీటిలో రైల్వే, రక్షణ, హోం, కార్మిక, తపాలా, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాకింగ్ రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఎంపికయిన వారితో మోదీ నేరుగా మాట్లాడనున్నారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పుకునేందుకు మోదీ ఈ విన్నూత్న కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.


Tags:    

Similar News