‍‍Narendra Modi : రేపు ప్రధాని విదేశీ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2024-10-09 07:43 GMT

 PM Modi visit Laos 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా మోదీ 21వ ఆసియాన్ - ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆసియాన్ - ఇండియాకు లాహోస్ అధ్యక్షత వహిస్తోంది.

ఈ సమావేశాల్లో...
ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో - పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది అని విదేశాంగ శాఖ పేర్కొంది.
Tags:    

Similar News