నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ 54

సతీష్ ధావన్ సెంటర్ లో పీఎస్ఎల్వీ సీ 54 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రయాణించనుంది.

Update: 2022-11-26 03:09 GMT

ఇస్రో మరో ప్రయోగానికి నేడు సిద్ధమయింది. నిన్న నే కౌంట్ డౌన్ ప్రారంభమయింది. సతీష్ ధావన్ సెంటర్ లో పీఎస్ఎల్వీ సీ 54 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రయాణించనుంది. ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ 54 ర్యాకెట్ ప్రయోగం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతం కావాలని చెంగాళమ్మ ఆలయంతో పాటు తిరుమలలో కూడా కూడా ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ వాహన నౌక ద్వారా...
ఈ వాహన నౌక ద్వారా మొత్తం తొమ్మిది ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్నారు. ఇందులో 960 కిలోల ఓషన్ శాట్ - 3 తో పాటు మరో ఎనిమిది ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశించనున్నాయి. వాణిజ్యపరంగా కొన్నింటిని ఇస్రో ప్రయోగిస్తుంది. పీఎస్ఎల్‌వీ రాకెట్ సిరీస్ లో ఇది 56వ ప్రయోగం. దాదాపు పీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయవంతం అయ్యాయి. ఈ ప్రయోగం కూడా విజయవంతం అవుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.


Tags:    

Similar News