నేడు పీఎస్ఎల్వీ ప్రయోగం
నేడు పీఎస్ఎల్వీ -సీ 55 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇస్రో ఈరోజు మరో వాణిజ్జ ప్రయోగానికి సిద్ధమయింది.
నేడు పీఎస్ఎల్వీ -సీ 55 రాకెట్ ప్రయోగం జరగనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈరోజు మరో వాణిజ్జ ప్రయోగానికి రెడీ సిద్ధమయింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక పై నిన్ననే కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ఇస్రో పీఎస్ఎల్వీ -సీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన టెల్ ఇయోస్ -2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.
సింగపూర్ ఉపగ్రహంతో పాటు...
741 కిలోల బరువు కలిగిన సింగపూర్ ఉపగ్రహం తో పాటు పదహారు కిలోల లుమొలైట్ అనే ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడానికి సిద్ధమయింది. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేసి ప్రయోగించడం వెనక శాస్త్రవేత్తల కృషి, శ్రమ ఉన్నాయి. ఈ ప్రయోగం కూడా విజయవంతమవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.